పంచాంగం మొత్తం ఒకే చోట, మీ ఊరి సమయాలతో.
తిథి, పండుగలు, ముహూర్తాలు, సంకల్పం, జాతకం, వివాహ పొంతన – అన్నీ ఒకే యాప్‌లో. భారతదేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, మీరు ఉన్న ఊరి సమయాల ప్రకారం.
- యాప్
- తెలుగు పంచాంగం
- ఫోన్లు
- Android
- భాష
- తెలుగు, ఇంగ్లీష్ లేదా రెండూ

విశేషాలు
రోజు, నెల, సంవత్సరం – అన్నీ ఒకే యాప్‌లో.
యాప్ తెరవండి, లేదా హోమ్ స్క్రీన్ విడ్జెట్ చూడండి చాలు. అన్నీ మీ ఊరికి, మీ స్థానిక సమయంలో.

కుటుంబం మొత్తానికి.
రిమైండర్ల నుంచి జాతక చక్రాల వరకు, కుటుంబాలు అడిగేవన్నీ – రెండో యాప్ అవసరం లేకుండా.
విడ్జెట్, రిమైండర్లు
హోమ్ స్క్రీన్ విడ్జెట్, ఉదయాన్నే నేటి పంచాంగం, పండుగ ముందు రోజు సాయంత్రం రిమైండర్, రాహుకాలం హెచ్చరిక.
జాతకం, వివాహ పొంతన
దశలతో రాశి, నవాంశ చక్రాలు; అష్టకూటం, దక్షిణాది పది పొంతనలు, షేర్ చేయడానికి రిపోర్ట్.
కుటుంబ తేదీలు
పుట్టినరోజులు, తద్దినాలు తిథి ప్రకారం – ప్రతి సంవత్సరం సరైన తేదీతో, రిమైండర్‌తో.
తెలుగు, ఇంగ్లీష్ లేదా రెండూ
అన్నీ తెలుగులో, ఇంగ్లీష్‌లో, లేదా పక్కపక్కనే చదవండి. పెద్ద అక్షరాలు, డార్క్ మోడ్ కూడా ఉన్నాయి.
మరిన్ని సాధనాలు
ఏ రోజుకైనా లగ్నం, హోర పట్టికలు; మీ స్థానిక సమయాలతో గ్రహణాలు; వాస్తు దిక్సూచి.
ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తుంది
సైన్-అప్ అవసరం లేదు, ఇంటర్నెట్ అవసరం లేదు. మీ జనన వివరాలు, కుటుంబ తేదీలు మీ ఫోన్‌లోనే ఉంటాయి.
ప్రశ్నలు
ఇంకా ఏమైనా అడగాలంటే support@manvilabs.com కి రాయండి. మా గోప్యతా విధానం (privacy policy) కూడా చూడండి.
భారతదేశం బయట కూడా పనిచేస్తుందా?
అవును. హైదరాబాద్ నుంచి డాలస్, లండన్ వరకు మీ ఊరిని ఎంచుకోండి; ప్రతి సమయం మీ స్థానిక సమయంలో కనిపిస్తుంది. పండుగ తేదీలు మీ ఊరికి తగ్గట్టు ఉంటాయి; భారతదేశంలో తేదీ వేరైతే అదీ కనిపిస్తుంది.
అకౌంట్ లేదా ఇంటర్నెట్ కావాలా?
అక్కర్లేదు. సమగ్ర ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది, సైన్-అప్ లేదు.
ఇంగ్లీష్‌లో చదవొచ్చా?
చదవొచ్చు. తెలుగు, ఇంగ్లీష్ లేదా రెండూ పక్కపక్కనే ఎంచుకోండి. సంకల్పాన్ని తెలుగు లేదా ఇంగ్లీష్ అక్షరాల్లో చూడొచ్చు.
నా జనన వివరాలు ఎక్కడ ఉంటాయి?
జనన వివరాలు, కుటుంబ తేదీలు మీ ఫోన్‌లోనే ఉంటాయి.
iPhone వెర్షన్ ఉందా?
ప్రస్తుతానికి సమగ్ర Android లో మాత్రమే ఉంది.
శుభకార్యానికి వాడొచ్చా?
ప్లాన్ చేసుకోవడానికి వాడండి; ముఖ్యమైన కార్యాలకు మీ కుటుంబ పురోహితుడిని కూడా సంప్రదించండి.



